Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
నానక్ రాంగూడవాసులు, వెటర్నరి డాక్టర్ రామరావు విజ్ఞప్తి మేరకు గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ సాయిబాబాతో కలిసి ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. నానక్ రాంగూడ ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి, వెటర్నరి వైద్యశాలలో వైద్య సిబ్బందికి సరైన వసతలు కల్పించాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నానక్ రాంగూడ పశువుల వైద్యశాలను పశువుల చికిత్సకు అనుగుణంగా అక్కడ వసతులను పరిశీలించి, వైద్య సిబ్బందికి వసతులకు కోసం తక్షణమే పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను సాయిబాబా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నారాయణ, జూపల్లి మధు, అనిల్‌సింగ్, నరేష్సింగ్, రమేష్‌గౌడ్, కృష్ణరెడ్డి,నానక్రంగూడ వాసులు, పీవీసీ స్టాప్ తదితరులు పాల్గొన్నారు.