Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పీఆర్టీయూ షాబాద్ మండల అధ్యక్షుడు సుదర్శన్
నవతెలంగాణ-షాబాద్
ఉపాధ్యాయ సమస్యలను పీఆర్టీయూ ఎప్పుడూ అలుపెరుగని పోరాటం చేస్తోందని ఆ సంఘం మండల అధ్యక్షుడు సుదర్శన్ అన్నారు. శుక్రవారం పీఆర్టీయూ జిల్లా 2022 సంవత్సరం డయిరీ, క్యాలెండన్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వంతో పోరాడి ఇప్పటి వరకు ఎన్నో సమస్యలను పరిష్కరించుకున్నట్టు గుర్తుచేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల కార్యదర్శి కృష్ణ, నర్సింహులు, ఎంఈవో శంకర్‌రాథోడ్, సంఘం నాయకులు హరికృష్ణ, డేవిడ్‌రెడ్డి, యాదయ్య, ప్రభాకర్‌రెడ్డి, రియాజ్, అంజయ్య, తదితరులు ఉన్నారు.