Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడంగల్
దౌల్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో గ్రాండ్ మాస్టర్ వెంకటయ్య ఆధ్యర్యంలో శుక్రవారం కరాటే గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. దానిలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి వినోద్ కుమార్, ఎనిమిదో తరగతి విద్యార్థి అనుషలకు కరాటే టెస్ట్‌లో బ్లాక్‌బెల్ట్, ప్రకాష్ టీచర్ బ్రౌన్ బెల్ట్, ప్రవీణ్, ముకేష్, నరేష్, హరివర్దన్ బ్లూ బెల్ట్స్ సర్టిఫికెట్ పొందారు. జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు ఉషన్న, దౌల్తాబాద్ సర్పంచ్ శిరీషరమేష్ వారికి సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో చదువుతో పాటు కరాటే చాలా అవసరమన్నారు. ఆడపిల్లలపై జరుగుతున్న దాడుల నుంచి వాళ్ళని వాళ్లు, రక్షించుకోవడానికి కరాటే ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ మాస్టర్స్ మహేష్, సభాన్న, నరేష్, దత్తు, ప్రవీణ్, పవన్, ప్రశాంత్, దస్తప్ప, శ్రీరామ్ పాల్గొన్నారు.