Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంత్యక్రియలకు ఆర్థిక సాయం
కాంగ్రెస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నాయకులు మర్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణ-మంచాల
మండల పరిధిలోని అంబొత్తండాకు చెందిన అంబొత్ రవీందర్‌నాయక్ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నాయకులు మర్రి నిరంజన్‌రెడ్డి అంబొత్ తండాకు చేెరుకుని, రవీందర్ నాయక్ మృతదేహంపై పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులును పరమార్శించి, అంత్య క్రియలకు రూ.8 వేల ఆర్థిక సహాయం అందజేశారు. నియోజక వర్గంలోని గ్రామాల్లో నిరుపేద కుటుంబాల వారు మృతి చెందితే తనవంతు ఆర్థిక సహా యం చేస్తానని తెలిపారు. అంత్యక్రియల్లో పాల్గొన్న వారిలో లొయపల్లి మాజీ సర్పంచ్ మోతీరాం నాయక్, స్థానిక ఎంపీటీసీ అంబొత్ రాందాస్, యాచారం మాజీ వైస్ ఎంపీపీ గజ్జి రామకృష్ణ, యాదవ్, కాంగ్రెస్ మండల నాయకులు మొకిల్ల ఉపేందర్ రెడ్డి, గ్రామపెద్దలు, పాల్గొన్నారు.