Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహేశ్వరం
ప్రజాసమస్యల పరిష్కారానికి పత్రికలు క్రియాశీలకంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి నివాసంలో నవతెలంగాణ 2022-క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభు త్వానికి వారధిగా పత్రికలు పనిచేసి మంచి పేరు తెచ్చుకో వాలన్నారు. నిజానిజాలను రాసినప్పుడే పత్రికలకు మంచి గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షులు అంగోతు రాజునాయక్, సర్పంచ్‌లు థాామస్రెడ్డి, నారాయణరెడ్డి, ఎంపీటీసీలు హనుమగల్ల చంద్రయ్య, నడికూడి రమేష్, నాయకులు మద్ది కరుణా కర్‌రెడ్డి, తొంట రవీందర్, పులిమామిడి శంకర్‌గౌడ్, నవతెలంగాణ రిపోర్టర్ కొండని శేఖర్, మధుసూదన్ రెడ్డి, పెంజర్ల గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.