Authorization
Mon Jan 19, 2015 06:51 pm
971 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
నవతెలంగాణ-మహేశ్వరం
నేడు మహేశ్వరం నియోజక వర్గంలో రూ.371 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులు శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ వస్తున్నారనీ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడుతూ నియోజక వర్గంలోని మీర్పేట్, బడంగ్పేట్ కార్పొరేషన్లు జలపల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీల పరిధిలో మంత్రి పర్యటిస్తారని తెలిపారు. తుక్కుగూడ మున్సిపాలిటీలో ఉదయం 10 గంటలకు రూ.4కోట్ల 50 లక్షలతో నిర్మిస్తున్న సమీకృతా వెజ్, నాన్వెజ్ మార్కెట్ పనులను రూ.29 కోట్లతో నీటి పైపులైన్లు, రిజర్వాయర్ల పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. జలపల్లి మున్సిపాలిటీలో 11 నుంచి నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. మున్సిపాలిటిలో రూ.72 కోట్లతో వాటర్ పైప్లైన్లు, రూ. 7కోట్లు హెచ్ఎండీఏ నిధులతో చేపట్టే రోడ్డు వెడల్పు పనులకు రూ.10 కోట్లు, టీయూఎఫ్ఎస్ఐడీసీ నిధులతో చేపట్టే రోడ్ల వెడల్పు పనులకు రూ.31 కోట్లతో చేపట్టె పహాడీ షరీఫ్ రోడ్డు విస్తరణ పనులకు రూ.10 కోట్ల 60 లక్షలతో చేపట్టే, స్ట్రామ్ వాటర్ డ్రయినేజీ పనులకు రూ.9 కోట్లతో నిర్మించే రాక్ గార్డెన్ పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో 11.45 గంటల నుంచి పర్యటించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతారని మంత్రి వివరించారు. కార్పొరేషన్లో రూ. 24 కోట్లతో తాగునీటి లైన్లకోసం రెండు చోట్ల రూ.18 కోట్లు 19 లక్షలతో బాక్స్ డ్రయినేజీ పనులకు రూ.7 కోట్లతో చేపడుతున్న అల్మాస్ గూడ కమాన్ నుంచి జిల్లేల గూడ కనకదుర్గ ఆలయం వరకు రూ. కోటి 50 లక్షలతో బాలాపూర్ క్రాస్ రోడ్డు నుంచి బాలాపూర్ కమాన్ వరకూ రోడ్డు విస్తరణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేస్తారని మంత్రి తెలిపారు. రూ.4 కోట్లతో ప్రశాంతి హిల్స్నండి విజ్ఞాన్పూరి కాలనీ హనుమాన్ మందిరం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి, అదేవిధంగా రూ.4 కోట్ల 50 లక్షలతో సమీకృతా మార్కెట్ సముదాయాలకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. మద్యాహ్నం 12.30 నిమిషాల నుంచి 4 బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.82 కోట్లతో రక్షిత తాగునీటి పథకంలో భాగంగా పనులకు రూ.4 కోట్లతో సమీకృతా మార్కెట్ పనులకు రూ.16 కోట్ల 60 లక్షలతో, రోడ్డు వెడల్పు పనులకు, అల్మాస్గూడలో రూ.23 కోట్ల 94 లక్షలతో,బడంగ్పేట్లో రూ.40 కోట్ల 10 లక్షలతో ఓపెన్ నాళాల నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నట్టు మంత్రి తెలిపారు.