Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంషాబాద్
మండల పరిధిలోని పెద్ద గోల్కొండ ఎంపీటీసీ గడ్డమీది యాదగిరి, ఉప సర్పంచ్ స్వరూప గౌడ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ గ్రామ సర్పంచ్ కామో నిబాయి లక్ష్మయ్య రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామంలో శనివారం సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ జరిగింది. గ్రామ సభకు వచ్చిన దళితులు దళిత బంధు పథకం గురుంచి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న గ్రామంలో రూ.10 లక్షలతో సీసీరోడ్డు పనులు ఎంపీటీసీ సర్పంచ్ స్వరూపగౌడ్ కలిసి ప్రారంభించారని తెలిపారు. గ్రామ సర్పంచ్ పంచాయతీ కార్యదర్శికి కూడా కనీస సమాచారం ఇవ్వకుండా పనులు ప్రారంభించాలని అన్నారు. తనకు తెలియకుండా పనులు ప్రారంభించినందుకు జరిగిన దళిత బంధులో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.