Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
కడ్తాల్ మండల కేంద్రానికి చెందిన షబ్బీర్, బోయిన్ గుట్ట తాండాకు చెందిన నేనావత్ రత్ని ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందారు. విషయం తెలుసుకున్న జిల్లా పరిషత్ గ్రామీణాభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులు, కడ్తాల్ జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్నాయక్ శనివారం బాధిత కుటుంబాలను పరామర్శించారు. తన కుమారుని జ్ఞాపకార్థం స్థాపించిన జర్పుల రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 వేలు ఆర్థికసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్, ఆమనగల్ కడ్తాల్ మండలాల పీఏసీఎస్ చైర్మెన్ గంప వెంకటేష్ గుప్తా, ఉపసర్పంచ్ రామకృష్ణ, ఏఎంసీ డైరెక్టర్ లాయఖ్ అలి, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు జోగు వీరయ్య, వార్డు సభ్యులు భిక్షపతి, రామచంద్రయ్య, బోయిన్ గుట్ట తాండాలో వార్డు సభ్యురాలు శాంతి, స్థానిక నాయకులు సోంలా నాయక్, కిషన్, రవీందర్, దీప్లా నాయక్, ఎన్.అంజి నాయక్ తదితరులు పాల్గొన్నారు.