Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-వికారాబాద్ డీసీసీ అధ్యక్షులు
రామ్మోహన్ రెడ్డి
-పరిగిలో 'మన ఊరు-మన పోరు' బహిరంగ సభ
-హాజరైన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రులు,
పార్టీ సీనియర్ నాయకులు
-భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
-పట్టణంలో భారీ ర్యాలీ, రేవంత్‌రెడ్డికి ఘన స్వాగతం
నవతెలంగాణ- పరిగి
సీఎం కేసీఆర్ వికారాబాద్ జిల్లాకు తీరని అన్యాయం చేశాడని డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. శనివారం పరిగి పట్టణ కేంద్రంలోని మినీ స్టేడియంలో రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన 'మన ఊరు -మన పోరు' బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభకు టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నుంచి పరిగి వరకు భారీ కాన్వారుతో చేరుకున్నారు. ఈ సందర్భంగా పరిగి కాంగ్రెస్ కౌన్సిలర్ అనసూయ కృష్ణ రేవంత్‌రెడ్డికి హారతి ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి దాదాపుగా ఎనిమిది వేల మంది వరకు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు హాజరయ్యారై సభను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తన ఉపన్యాసంతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. ప్రభుత్వ వైఫల్యాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు కాబోయే సీఎం రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. బహిరంగ సభలో మాజీ మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపించడా నికి రేవంత్‌రెడ్డి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ఎస్సీ, సబ్ ప్లాన్‌కు డబ్బులు కేటాయిస్తున్నా రు కానీ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఇప్పటివరకు 85 వేల కోట్లు కేటాయించి 48 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని వివరించారు. ఎస్సీ, ఎస్టీలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు రచించా రని అన్నారు. అటువంటి రాజ్యాంగాన్ని కేసీఆర్ మార్చాలని అనడం దుర్మార్గమని అన్నారు. అసలు కేసీఆర్ రాజ్యాంగాన్ని చదివాడా, రాజ్యాంగం గురించి తెలుసా అని ప్రశ్నించారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలనికోరారు. కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వికారాబాద్ ప్రజలకు ఏం చేశారని అన్నారు. 'ఒరేరు కెేసీఆర్ నీయబ్బ వికారాబాద్ ప్రజల నడ్డివిడిచావురా.. ఎవరిని దోచి ఎవరికి పెడుతున్నావ్ తెలుసు.. భారత రాజ్యాంగన్ని మారుస్తాం అంటావా, బకోడికి బలిసిం ది తొక్కితే గాని సక్కగా అవుతాడ' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వికారాబాద్ జిల్లాకు తీరని అన్యాయం చేశారని పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజలను మోసం చేసి నీళ్లు రాకుండా చేశారని విమర్శించారు. మనకు పట్టిన శని, భానుమతిని వదిలించడానికి రేవంత్‌రెడ్డి వచ్చాడని అన్నారు. 2014 ఎన్నికల్లో వికారాబాద్ అనంతగిరిని ఔషధ నగరంగా చేస్తానని చెప్పాడని, 2018 ఎలక్షన్ లో ఎంఎంటీఎస్‌ను వికారాబాద్‌కు పొడిగిస్తామని చెప్పి మోసం చేశాడని ఆరోపించారు. ప్రస్తుతం వికారాబాద్‌లో ఉన్న కలెక్టర్ ధరణి పోర్టల్‌లో పెండిం గ్ ఉన్న ఫైళ్ళను క్లియర్ చేయడానికి ఎకరానికి లక్ష రూపాయలు చొప్పున తీసుకుంటుందని ఆరోపించా రు. ప్రాంతాన్ని బట్టి ఎకరానికి ఒకటి నుంచి రెండు లక్షల వరకు వసూలు చేస్తూ నిరుపేదలకు దోచుకుం టూ రోజుకు కోటీ రూపాయలు సంపాదిస్తుందని ఆరోపించారు. ఏసీబీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు నియామకాలు రావాలం టే రేవంత్ రెడ్డిని సీఎం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పరిగి ప్రాంత ప్రజలను, జిల్లా వాసులను మోసం చేశారని అన్నారు. పరిగి ప్రాంతానికి కావాల్సిన అభివృద్ధిని తొక్కి పెట్టి ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన సీఎం కేసీఆర్, పార్లమెంట్ ఎన్నికలలో వచ్చిన మంత్రి కేటీఆర్‌లు టీిఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే రాబోయే రెండు సంవత్సరాలలో పరిగి నియోజకవర్గానికి, వికారాబాద్ జిల్లా ప్రాంతానికి సాగునీరు తీసుకు వచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ప్రగల్బాలు పలికారని కానీ గెలిచి మూడేండ్లు అవు తున్నా చుక్క నీరు కూడా రాలేదని మండిపడ్డారు. వికారాబాద్ నుంచి కృష్ణ వరకు రైల్వేలైన్ గతంలో మంజూరు అయినప్పటికీ రాష్ట్రా ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా ఆపుతుందని తెలిపారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్ట్‌ను గత వైయస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తను అడిగి పరిగి వరకు మంజూరు చేసుకున్ననప్పటికీ కావాలని సీఎం కేసీఆర్ రీడిజైన్ పేరుతో ఇక్కడి ప్రాంత ప్రజల కడుపులు కొట్టి తన ప్రాంతానికి తీసుకెళ్లాడని అన్నారు. దామగుండంలో రూ.19 వందల కోట్లతో నేవీ ర్యాడర్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు జీవో విడుదల అయినప్పటికీ, ఆ భూమిని నేవీ వారికి అప్పగించకుండా ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. హైద రాబాద్ నుంచి మన్నెగూడా వరకు 4 లైన్ల రహదారి గతంలోనే ఆస్కార్ ఫెర్నాండేజ్ ఉపరితల రవాణ శాక మంత్రి మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్థల సేకరణ చేయకుండా ఆపుతుందని, ఇలాంటి ప్రాజెక్టులను వెంటనే నిధులు ఇచ్చి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌కి తన సొంత ప్రాంతంపై ఉన్న శ్రద్ధ వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలపైగాని లేదని అన్నారు. ఈ ప్రాంత అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ప్రశ్నించి అభివృద్ధికి నిధులు తేవడంలో విఫలం చెందారని విమర్శిం చారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి ఊరికి ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రని పేర్కొన్నారు. ఈ పోరు ఇక్కడి నుంచి ప్రారం భమై రాష్ట్రం మొత్తం నిర్వహిస్తామని అన్నారు. కేసీ ఆర్ వైఫల్యాలను ఎండగట్టి ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.