Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్ మండల కేంద్రానికి చెందిన నాగిళ్ళ యాదయ్య, వెల్దండ మండలంలోని చౌదర్ పల్లి గ్రామానికి చెందిన కావటి మల్లయ్య, పంజుగుల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పరుశురాములు భార్య పెరుమాళ్ళ వెంకటమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తలకొండపల్లి జడ్పీటీసీ సభ్యులు ఉప్పల వెంకటేష్ శనివారం బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ తాను స్థాపించిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 వేలు ఆర్థికసాయం అందజేశారు. అదేవిధంగా వెంకటమ్మ కుటుంబానికి క్వింటాల్ బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగిళ్ళ జగన్, అయోధ్య, వెంకటయ్య, శ్రీను, బాలరాజు, వి.శ్రీను శ్రీనివాస్, మహేష్, చౌదర్పల్లిలో బాలు, కొండల్, నాగరాజు, నర్సోజీ, నాగయ్య, కష్ణయ్య, పంజుగులలో గణేష్, రవి, రాజేష్, శేఖర్, ప్రభాకర్, రమేష్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.