Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోమిన్ పేట
పరిగిలో నిర్వహించిన 'మన ఊరు-మన పోరు' బహిరంగ సభకు కాంగ్రెస్ మండల అధ్యక్షులు శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఈ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సురేందర్, సర్పంచ్ పన్నాల శ్రీనివాస్ రెడ్డి, సుభాష్, మైపాల్ రెడ్డి నాయకులు మహేందర్ రెడ్డి, ఎండి సిరాజుద్దీన్ మానేయ యాదవ్, చంద్రన్న, నర్సింలు, మహేందర్, మజర్, తేజ్, తదితరులు ఉన్నారు.