Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నవాబుపేట్
ప్రాథమిక పాఠశాల నవాబుపేటలో శనివారం కొండా విశ్వేశ్వర్‌రెడ్డి జన్మదిన సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ఉచితంగా 50 స్కూల్ బ్యాగులను డొనేట్ చేశారు. విశ్వేశ్వర్‌రెడ్డి ట్రస్ట్ తరపున సంజీవరావు బ్యాగులు అందజేశారు. గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి, నాయకులు ప్రకాశం, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పాండు, నాయకులు నరసింహారెడ్డి, ఎస్ఎంసీ చైర్మెన్ సంగమేశ్వర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు, ఉపాధ్యాయులు మాయాదేవి, గోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పాండు మాట్లాడుతూ పేద విద్యార్థుల పట్ల విశ్వేశ్వరరెడ్డి సేవాభావం ఎంతో గొప్పదని, అదేవిధంగా పేద పిల్లలకు ఇంకా ఆయన సేవలు కొనసాగించాలని కోరారు. మండలంలోని ప్రతి ఉన్నత పాఠశాల, కాలేజీ విద్యార్థులుకు సర్పంచ్ ఆధ్వర్యంలో రూ. 1500 చొప్పున ఆర్థిక సాయం చేయడం గొప్ప విషయమని కొనియాడారు. శనివారం జడ్పీహెచ్ఎస్ నవాబ్‌పేట్ ఆదర్శ పాఠశాల, కస్తూర్బా పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చెక్‌లు అందచేశారు.