Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-నిఘా నేత్రాల ఏర్పాటుకు కృషి చేయాలి
-ఎస్ఐ మధుసూదన్ రెడ్డి
నవతెలంగాణ- తాండూరు రూరల్
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమనీ, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం కృషి చేయాలని కరణ్ కోట ఎస్సై మధుసూదన్ రెడ్డి అన్నారు కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా శనివారం మండలంలోని కరణ్ కోట గ్రామంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ .. బాల్య వివాహాలు చట్ట రీత్యా నేరం అన్నారు. ప్రతి గ్రామంలో నిఘా నేత్రాల ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. వీటిని ఏర్పాటు చేయడం వల్ల గ్రామాల్లో నేరాలు జరిగే అవకాశం లేదన్నారు. రోడ్డు భద్రత నియమ నిబంధనలను పాటించాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ సమష్టి కృషి తో ఉండి గ్రామాన్ని అభివృద్ధి దిశలో నడిపించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్ర మంలో సర్పంచ్ వీణా హేమంత్ గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.