Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఎంపీపీవై రవీందర్ యాదవ్
నవతెలంగాణ-కేశంపేట
సీఎం సహాయనిధితో పేద ప్రజలు కూడా మెరుగైన వైద్యం చేయించుకుంటున్నారని ఎంపీపీి వై రవీందర్ యాదవ్ అన్నారు. శనివారం కేశంపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్దిదారులకు ఆయన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఇప్పలపల్లి పి బాలమణి రూ. 60 వేలు, కేశంపేట జి.జయమణి రూ.38 వేలు, నిర్దవెళ్లి చంద్రశేఖర్ రూ. 39వేలు, అలివేలు రూ. 38,500, ఆల్వాల్ టి అంతయ్య రూ.51,500వేలు, రాజు రూ.22వేలు, లక్ష్మమ్మ రూ.20 వేలు, కొండారెడ్డిపల్లి పరిగి శ్రీను రూ.16వేలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మెన్ ఈట గణేష్, ఆయా గ్రామాల సర్పంచులు వెంకట్ రెడ్డి, నవీన్ కుమార్, పీిఎసీఎస్ డైరెక్టర్ కృష్ణయ్య, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, వేణుగోపాల చారి, జగన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రాజశేఖర్ గుప్తా, వెంకటయ్య, అంజయ్య గౌడ్, బాలయ్యగౌడ్తో పాటు తదితరులు పాల్గొన్నారు.