Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-చందానగర్ పోలీసు స్టేషన్లో ఘటన
నవతెలంగాణ-మియాపూర్
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు గృహిణులు, ఒక వృద్ధుడు ఆదృశ్యమైయ్యారు. ఈర ఘటన చందా నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్ రెడ్డి కాలనీలో నివాసం ఉండే అనిల్ కుమార్ సోదరి స్వాతి (22)ని యాదాద్రి జిల్లా ములకలపల్లి గ్రామానికి చెందిన ముఖేష్ కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే ఈనెల 11న భర్తతో గొడవపడిన స్వాతీ తన మూడేండ్ల్ల పాప గౌతమిని తీసుకుని సోదరుడి ఇంటికి వచ్చింది. వారం రోజుల పాటు చందానగర్‌లోనే ఉన్న స్వాతి ఈనెల 19న ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె తిరిగి పుట్టింటికి రాకపోగా మెట్టినింటికి కూడా వెళ్లలేదు. ఇలా పలుమార్లు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి వచ్చేది. కానీ ఈసారి తిరిగి ఇంటికి రాకకపోవడంతో ఎక్కడ వెతికినా ఆమె ఆచూకి లభించలేదు. సోదరుడు ఇచ్చిన చందానగర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
భర్త వేధిస్తున్నడంటూ మరో గృహిణి
వారిద్దరికి పెద్దల సమక్షంలో ఘనంగా పెండ్లి అయింది. పెద్దవారెవరూ లేకుండా ఇద్దరూ కలిసి కాపురం ఉంటున్నారు. కానీ ఉన్నట్టుండి ఆమె భర్త వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఉత్తరం రాసి పెట్టి కనబడకుండా పోయిన ఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ప్రణరు కుమార్ నగరంలోని ఓ ప్రయివేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా అతని భార్య శిరీష (22) గహిణి. వీరికి గత 7 నెలల క్రితం వివాహం జరిగింది. వీరు చందానగర్ లోని గౌతమి నగర్లో నివాసం ఉంటున్నారు. ఈనెల 25న ఎప్పటి మాదిరిగానే ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లగా అతని భార్య శిరీష ఇంట్లో ఉంది. మధ్యాహ్న సమయంలో కూడా ఫోన్ చేసి మాట్లాడుకున్నారు. విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కనబడకుండా పోయింది. తనను వేధింపులకు గురిచేస్తున్నాడని అందుకే ఇంటి నుండి వెళ్లిపోతున్నట్టు లేఖలో పేర్కొంది. ఆ ఉత్తరంతో పాటు నిశ్చితార్థం రింగ్ వదిలేసిందని, కానీ బీరువాలోని పట్టు చీరలు, 8 తులాల బంగారు అభరణాలు ఇతర వెండి వస్తువులు కనబడడం లేదనీ, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన ఆచూకీ కనిపెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కనబడకుండా పోయిన వద్ధుడు
వాకింగ్ కోసమని వెళ్లిన వద్ధుడు ఆదృశ్యమైయ్యాడు. వాసుదేవ్ విశ్వనాథ్ దూసే (73)తన కుమారుడితో కలిసి చందానగర్ ఫ్రెండ్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల ఎంఐజీ కాలనీలో ఉంటున్న తన కూతురు స్వాతి ప్రశాంత్ పాటిల్ ఇంటికి వెళ్లాడు. అక్కడి నుండి ఈనెల 25న ఉదయం చందానగర్ పీజేఆర్ స్టేడియానికి వాకింగ్‌కి వెళ్లిన విశ్వనాథ్ తిరిగి ఇంటికి రాలేదు. వారి కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, తెలిసిన ప్రదేశాలలో వెతికినా ఆయన ఆచూకీ దొరకలేదు. దీనిపై విశ్వనాథ్ కుమారుడు వైభవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.