Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పూడూర్
పూడూరు మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామంలో సేవాలాల్ జయంతి ఉత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే గిరిజనులంతా గ్రామంలోని ఆలయం వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. దానిలో గ్రామస్తులంతా చిన్న పెద్ద తేడా లేకుండా నృత్యాలు చేస్తూ ఎంతో వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కంల్లి బారు (పెంటయ్య) సొసైటీ డైరెక్టర్ రాము, ఉప సర్పంచ్ రాజ్ కుమార్, గ్రామస్తులు గోపాల్‌నాయక్, కాంగ్రెస్ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు పరుశురాం, బాలునాయక్, భానుప్రకాష్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.