Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-జీవాలను పట్టించుకోని వైద్య బృందం
నవతెలంగాణ మొయినాబాద్
మండల కేంద్రంలో పంచాయతీ, అనుబంధ గ్రామాల్లో పశు వైద్యుల కొరతతో మూగా జీవాలు మృత్యువాత పడుతున్నాయి. కేతిరెడ్డిపల్లిలో అంకమోని శ్రీనివాస్ పాడి పరిశ్రమ మీద మక్కువతో ఆవును నెల రోజుల కిందటరూ.85 వేల కొనుగోలు చేసి గ్రామానికి తీసుకు వచ్చాడు. దాని ద్వారా పాల ఉత్పత్తి వస్తుందని భావించారు. కానీ ప్రసవించే సమయంలో సరైన వైద్యం అందక అందుబాటులో గ్రామంలో డాక్టర్ లేక వేరే గ్రామంలో వైద్యులకు సమాచారం అందించిన వారు రాకపోవడంతో ఆవు ప్రాణాలు విడిచిందని ఆవేదన చెందారు. ముగా జీవాల ప్రాణాలకు విలువ లేకుండా పోతుందని, వాటిని సంరక్షణ నిమిత్తం వైద్యులు అందుబాటులో లేక ఇలా మండల కేంద్రంలో ఎన్నో జీవాల ప్రాణాలు బలైతున్నాయన్నారు. అందుబాటులో పశు వైద్యులు ప్రతి గ్రామంలో ఉండాలని, ఇలాంటి మూగా జీవాలు మరణాలు పునారావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పశు వైద్య అధికారులను కోరారు. ప్రభుత్వం న్యాయం జరిగేలా చూడాలని కోరారు.