Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేశంపేట
గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటునందించడం అభినందనీయమని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. కేశంపేట్ మండలం ఎక్లాస్ ఖాన్ పేట గ్రామంలో దివ్య శక్తి రౌండ్ టేబుల్ ఇండియా 134 ఫౌండేషన్ వారి సౌజన్యంతో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల తరగతి గదులను ఆయన ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో జడ్పీి వైస్ ఛైర్మెన్, ఎంపీపీ వై రవీందర్ యాదవ్, జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ కుమార్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, స్థానికప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.