Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-వికారాబాద్ జిల్లా అదనపు న్యాయమూర్తి
వై.జయప్రసాద్
నవతెలంగాణ-వికారాబాద్ రూరల్
రాజీ మార్గమే రాజా మార్గమని అందుకు లోక్ అదాలత్ మంచి అవకాశమని వికారాబాద్ జిల్లా అదనపు న్యాయమూర్తి వై. జయప్రసాద్ తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా కోర్ట్ ఆవరణలో కోఆడినషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు న్యాయమూర్తి మాట్లాడుతూ మండల న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో వచ్చే నెల 12వ తేదీన జరిగే లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకోవాలని సూచించారు. వికారా బాద్ జిల్లా పరిధిలోని వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ల నాలుగు నియోజకవర్గల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసులలో అందులో రాజీ కుదిర్చే విధంగా ఉన్న కేసులను పోలీసులు తమ పరిధిలోని కేసులను అధిక సంఖ్యలో రాజీ పడే విధంగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయమూర్తి శెంకరి శ్రీదేవి, ప్రిన్సిపాల్ జూనియర్ న్యాయమూర్తి కె.శ్రీకాంత్, బార్ ప్రెసిడెంట్ నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్, అసెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.అన్వేష్ సింగ్, సమీన బేగం, వికారాబాద్ డీఎస్పీ బివి సత్యనారాయణ, తాండూరు డీఎస్పీ లక్ష్మీ నారాయణ, చేవెళ్ల ఏసీపీ రవీందర్రెడ్డి, జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు, కోర్ట్ కానిస్టేబుల్లు, సిబ్బంది పాల్గొన్నారు.