Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గండిపేట్
చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పుట్టినరోజును పురష్కరించుకుని జెకెఎంఆర్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు అర్థిక సాయం అందజేశారు. గండిపేట్ ప్రభుత్వ పాఠశాల్లో చదువుకుంటున్న విద్యార్థులను గుర్తించి రూ.1500 అందజేశారు. రంగారెడ్డి జిల్లా టీఆర్టీఎస్ జిల్లా అధ్యక్షులు లోకేశ్వర్ మాట్లాడుతూ.. కొండా పుట్టిన రోజున పేద విద్యార్థులకు చేయుతనివ్వడం సంతోషకరమన్నారు. పేద విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్టీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జామ కుశాల్, ఉపాధాయురాలు మనోహరమ్మ, విద్యార్థులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.