Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
-రూ.3 కోట్ల 20 లక్షలతో పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-గండిపేట్
నార్సింగి మున్సిపాలిటీని రాబోయే తరాల కోసం అదర్శంగా తీర్చిదిద్దుతామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. శనివారం మున్సిపల్ పరిధి లోని 6, 16, 17వ వార్డుల్లో ఛైర్పర్సన్ రేఖా యాదగిరి, వైస్ ఛైర్మెన్‌తో కలిసి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నార్సింగి మున్సిపాలిటీని అన్నిరంగా ల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. సీసీరోడ్డు, డ్రయినేజీ తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నిత్యం కృషి చేస్తామన్నారు. పార్టీకతతీతంగా అభివృద్ధి చేస్తామన్నారు.
సమస్యలపై ఎమ్మెల్యేకు విన్నతి
నార్సింగి కౌన్సిలర్ కె. ఉషారాణి వార్డులో రూ.25 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించ డానికి ఎమ్మెల్యేకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, ఫించన్లు, రేషన్‌కార్డులు, తాగునీటి ట్యాంక్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. తమ వార్డులో కోవిడ్‌తో తల్లి మృతి చెందడంతో అనాథగా మారిన బాలికకు చేయుతనివాలని కౌన్సిలర్ ఉషారాణి ఎమ్మెల్యేకు వి న్నవించారు. మహిళలకు డ్వాకా భవనాలు, అంగన్ వాడీ కేంద్రాలకు సొంత భవనాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఛైర్పర్సన్ దార్గు పల్లి రేఖాయాదగిరి, వైస్ ఛైర్మెన్ వెంకటేష్‌యాదవ్, ప్రవీణ్‌యాదవ్, కమిషనర్ సత్యబాబు, డీఈ నర్సింహారాజు, మండల మహిళా అధ్యక్షురాలు పత్తి శోభరాజు, కౌన్సిలర్ కె.ఉషారాణి, అరుణజ్యోతి, అమరేందర్‌రెడ్డి, శ్రీకాంత్, లక్ష్మీప్రవళిక కిరణ్‌కుమార్, విజేతప్రశాంత్యాదవ్, సునితాగణేష్, నాయకులు పత్తి రాజు, హరిశంకర్, డైరెక్టర్ రాజుకుమార్, రాము, నాయకులు మల్లేష్, ప్రియాదర్శినీ, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.