Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-డిప్యూటీ మేయర్ రాజేందర్‌రెడ్డి
-అదనపు గదులు ప్రారంభం
నవతెలంగాణ-గండిపేట్
ప్రభుత్వ బడుల్లో విద్యవనరులను బలోపేతం చేయాలని డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్‌రెడ్డి అన్నారు. శనివారం బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ హైదర్షాకోట్ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ప్లాంకిన్ టెబుల్, రౌండ్ టెబుల్ ఇండియా సహకారంతో స్కూల్ అదనపు తరగతి గదులను నిర్మించారు. డిప్యూటీ మేయర్, సేవ సంస్థల ప్రతినిధుల అధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ... విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలన్నారు. విద్య ప్రమాణాలను పెంచాలన్నారు. మండలంలోనే హైదర్షాకోట్ను ముందు ఉంచాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో పాఠశాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చంద్రశేఖర్, మంద రవీందర్‌రెడ్డి, సంతోషీరాజిరెడ్డి, షాపూరం శ్రీనాథ్‌రెడ్డి, స్కూల్ హెడ్ మాస్టర్ మదన్‌కుమార్, స్వచ్ఛంద సంస్థ చైర్మెన్ రామకృష్ణ, నిర్మల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు.