Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గండిపేట్
మన ఊరు- మన పోరు సభకు వెళ్లిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్థానిక నాయకులు ఘన స్వాగ తం పలికారు. శనివారం రాజేంద్రనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు జ్ఞానేశ్వర్, ముంగి జైపాల్‌రెడ్డి, క్యాతం అశోక్‌యాదవ్, పూలపల్లి కృష్ణారెడ్డి,కాంగ్రెస్ నాయకులు అప్పా జంక్షన్ వద్ద స్వాగతం పలికారు. రేవంత్‌రెడ్డిని గజామాల, శాలువలతో ఘనంగా సన్మానించారు. అక్కడి నుంచి కాంగ్రెస్ నాయకులు రేవంత్‌రెడ్డితో కలిసి మొయినాబాద్, చేవెళ్ల, మన్నేగూడ మీదిగా పరిగి సభకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ కార్పొరేటర్లు, కౌన్సిలర్, నాయకులు పాల్గొన్నారు.