Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ మహేందర్ గౌడ్
నవతెలంగాణ-గండిపేట్
చెరువులను సంరక్షించుకోవాలని మేయర్ బుర్ర మహేందర్‌గౌడ్, కమిషనర్ వేణుగో పాల్‌రెడ్డి అన్నారు. శనివారం బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఫిరంచెరువు వద్ద దృవాన్ అర్గనైజర్ సహకారంతో పరిశుభ్రత కార్యక్రమా లను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... బండ్లగూడ కార్పొరేషన్లో భూ గర్బ జలాలను మరింత పెంచాలన్నారు. రాబో యే తరాల వారి కోసం చెరువులను, కుంటలను కాపాడాలన్నారు. చెరువుల్లో ఎలాంటి వ్యర్థలు వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నా రు. మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, బ్రాండ్ అంబాజిటర్ సిక్కిరెడ్డి, స్వరాజ్, ఫౌండేషన్ ప్రతినిధులు, కార్పొరేషన్, సిబ్బంది, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.