Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ ధూది ప్రవీణ్ కుమార్, ఎంపీటీసీ బాకారం అంజయ్య
నవతెలంగాణ-మొయినాబాద్
మండల కేంద్రంలో మేడిపల్లి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదనిసర్పంచ్ ధూది ప్రవీణ్‌కుమార్, ఎంపీటీసీ బాకారం అంజయ్య అన్నారు. శనివారం గ్రామంలో రూ. 25 లక్షల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా సీసీరోడ్డు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ధూది ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ గ్రామాన్నీ అన్నీ రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. గతంలో పోలిస్తే గ్రామం అభివృద్ధి పథంలో దూసుకు పోతోందని అందుకు గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు తెలిపారు. గ్రామస్తులు సహకారం అందిస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామం గా తీర్చిదిద్దుతామని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ జొన్నడ శంకర్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి మురళీ పాల్గొన్నారు.