Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుల్కచర్ల
కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం తలనీలాల బహిరంగ వేలం పాట నిర్వహిం చారు. 1-3-2022 నుంచి 28-2-2023 వరకు బహిరంగ వేలం పాటలో అందరికంటే ఎక్కువగా అంగులూరి పోలేరు ఎల్బీనగర్ రూ.2,35, 999 లకు దక్కించుకున్నారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు మధుబాబు, కార్యనిర్వహణాది కారి సుధాకర్, చైర్మెన్ రాములు, కమిటీ సభ్యులు, అర్చకులు పాండు శర్మ, దశరథం, గ్రామస్తులు పాల్గొన్నారు.