Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 40 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం
- వార్డు మెంబర్ విస్లావత్ గోపాల్ను
పట్టుకున్న ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ
నవతెలంగాణ- కొడంగల్
దౌల్తాబాద్ మండలం లోట్టిగుంట తాండలో నాటు సారా తయారీ స్థావరంపై ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ సైదులు మాట్లాడుతూ లోట్టిగుంట తండా నాటుసారా స్థావరంపై దాడి నిర్వహించి 40 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నాటుసారా విక్రయాలు జరుపుతున్న విస్లావత్ గోపాల్ లోటిగుంట తండా వార్డ్ మెంబర్ నాటు సారా తయారు చేస్తూ 40 లీటర్ల బెల్లం పానకంతో పట్టుబడినట్టు తెలిపారు. కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్, ఎక్సైజ్ ఎస్సై శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.