Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంట్వారం
బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శరణ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ జన్మదిన వేడుకల్లో మర్పల్లి ఏఎంసీ చైర్మెన్ దుర్గం చెరువు మల్లేశం ముఖ్య అతిధిగా పాల్గొని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో ఎంపీటీసీల ఫోరమ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, మధ్వాపూర్ సర్పంచ్ గోవింద్ రెడ్డి, నాయకులు మహిపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
.