Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ కొప్పు సుకన్య భాష
నవతెలంగాణ-యాచారం
గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు 100శాతం పూర్తి చేయాలని ఎంపీపీ కొప్పు సుకన్య భాష కోరారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులతో ఎంపీపీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వాల సహకారంతో గ్రామాల్లో జరుగుతున్న శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, ఇతర అభివృద్ధి పనులను వంద శాతం పూర్తి చేయాలని కోరారు. అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో జరిగేందుకు సర్పంచ్లు, పంచాయతీ సెక్రటరీలు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా నర్సరీలల్లో మొక్కలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అన్ని గ్రామాల్లో టాక్సీ సకాలంలో చెల్లించే విధంగా చూడాలని ఎంపీపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీవో శ్రీలత, ఏపీవో లింగయ్య, సీసీ శివ శంకర్, పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.