Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాండూరు రూరల్
తాండూరు మండలం గోనూరు గ్రామంలో చాకలి రమేష్ అనుమతి లేకుండా నిర్మిస్తున్న ఇంటి పనులను అధికారులు శనివారం అడ్డుకున్నారు. చాకలి వెంకటయ్య ఫిర్యాదు చేయడంతో పంచాయతీ అధికారి రతన్ సింగ్ అక్కడికి వెళ్లి ఈ నిర్మాణం పనులు ఆపి వేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అనుమతి లేకుండా ఇంటి నిర్మాణం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.