Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి కొల్లం అనంతరెడ్డి
నవతెలంగాణ-యాచారం
వార్డు సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి గ్రామ పంచాయతీల్లో వారిని గౌరవించే విధంగా చూడాలని ఆ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి కొల్లం అనంతరెడ్డి శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీల్లో వార్డు సభ్యులకు ప్రభుత్వం గుర్తింపు తీసుకొచ్చి వారికి గౌరవ వేతనం ఇచ్చేలా చూడాలని కోరారు. ప్రజల ఓట్లతో గెలిచిన వార్డు సభ్యులు గ్రామ పంచాయతీలో వారికి గుర్తింపు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కోసారి వార్డు సభ్యులు అగౌరవానికి గురైన సంఘటనలు చాలా ఉన్నాయని ఆరోపించారు. వారికి గ్రామ పంచాయతీలో ఏదో ఒక బాధ్యత చూసే విధంగా ప్రభుత్వం చూడాలని కోరారు.