Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోల్కంపల్లి సర్పంచ్
చెరుకూరి అండాలుగిరి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
తరగతి గది నుంచే దేశ భవిష్యత్తు నిర్మాణమవు తుందని పోల్కంపల్లి సర్పంచ్ చెరుకూరి అండాలుగిరి అన్నారు. పోల్కంపల్లి ప్రభుత్వ పాఠశాలలో పని చేసిన ఉపాధ్యాయులు శ్రీనివాస్‌రెడ్డి బదిలీపై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ మండలంలోని జైపురి కాలనీ ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం వీడ్కోలు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోల్కంపల్లి పాఠశాలను బలో పేతం చేయడంతో పాటూ విద్యార్థులకు విద్యతో పాటు చక్కటి సంస్కారం నేర్పించే వారన్నారు. విద్యా ర్థుల పట్ల శ్రద్ధ తీసుకొని బాగా చదువులకు ప్రోత్సహించేవారన్నారు. ప్రతి విద్యార్థుల పట్ల వ్యక్తి గత పర్యవేక్షణ చూపేవారని వివరించారు. అలాంటి ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి తమ గ్రామం నుంచి బదిలీ కావడం చాలా బాధాకరమన్నారు. నిబద్ధత కలిగిన ఉపాధ్యాయులు తమ పాఠశాలలో పని చేస్తుండడం వల్లనే తమ ఇద్దరి కుమారులను ప్రభు త్వ పాఠశాలలో చేర్పించడం జరిగిందని తెలిపారు. ఎంపీటీసీ చెరుకూరి మంగ రవీందర్ మాట్లాడుతూ.. శ్రీనివాస్‌రెడ్డి ఉపాధ్యాయులుంటే ప్రభుత్వ పాఠశాలలు మరింత బలపడతాయని గుర్తు చేశారు. పాఠశాల అభివృద్ధి పట్ల నిరంతరం శ్రమించే వారని చెప్పారు. ఎప్పటికప్పుడు అధికారులు, ప్రజా ప్రతినిధులతో చర్చించే వారని చెప్పారు. గ్రామంలోని పిల్లల తల్లి దండ్రులను ఆత్మీయ పలకరించి పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు చొరవ చూపేవారని వివరించారు. కరోనా సమయంలో ఇంటింటికీ తిరిగి విద్యార్థుల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారని అన్నారు. ఎక్కడ బదిలీపై వెళ్లినా పేద విద్యార్థులు ఉన్నత చదువులను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకట్‌రెడ్డి, జెడ్పీ హెచ్ఎం పాండురంగం, పీఆర్టీయూ మండల అధ్య క్షులు వర్కాల పరమేశ్, నెర్రపల్లి ప్రధానోపాధ్యా యులు బాలాజీ, పాఠశాల ప్రధనోపాధ్యాయులు నర్సింహా రావు, ఉపాధ్యాయులు పట్నం క్రిష్ణ, కిరణ్ కుమార్, నాయకులు బాలకిషన్, ఎస్ఎంసీ చైర్మన్ యాదయ్య పాల్గొన్నారు.