Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల వైద్యాధికారి డాక్టర్ మురళీ కృష్ణ
నవతెలంగాణ-కుల్కచర్ల
పల్స్ పోలియో కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్టు మండల వైద్యాధికారి డాక్టర్ మురళి కృష్ణ, సీహెచ్ఓ చంద్ర ప్రకాష్ తెలిపారు. శనివారం విలేకరు లతో వారు మాట్లాడుతూ.. కుల్కచర్ల చౌడాపూర్ మండలాల్లో 5,450 మంది 0 - 5 ఏండ్ల పిల్లలు ఉన్నారని తెలిపారు. 45 బూతులు ఏర్పాటు చేసి 100 శాతం చిన్నారులకు పోలియో చుక్కలు 180మంది సిబ్బంది సిద్ధంగా ఉన్నామన్నారు. మండల కేంద్రంలో ఉదయం 9గంటలకు ప్రజాప్రతినిధులతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు.
విద్యార్థుల ర్యాలీ..
పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల పరిధిలోని పీరంపల్లి గ్రామంలో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, వైద్య సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.