Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
కడ్తాల్ మండలంలో తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మెన్ గంగారెడ్డి శనివారం పర్య టించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ గ్రామీ ణాభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులు, కడ్తాల్ మండల జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్, డీసీసీబీ డైరెక్టర్, ఆమనగల్ కడ్తాల్ మండలాల పీఏసీఎస్ చైర్మెన్ గంప వెంకటేష్ గుప్తా, సర్పంచ్ రామావత్ తులస ిరామ్ నాయక్ తదితరులతో కలిసి గంగారెడ్డి మైసిగండి మైసమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పీఏసీఎస్ చైర్మెన్ గంప వెంకటేష్ గుప్తా తో కలిసి జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ గంగారెడ్డిని పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్క్ ఫెడ్ ఎం.డీ మీనా, ఏడీఏ వెంకట్రామ్ రెడ్డి, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు జోగు వీరయ్య, వైస్ చెర్మెన్ సత్యం, ఉపసర్పంచ్లు రామకృష్ణ, రాజు, నాయకులు మహమ్మద్ ఇర్షాద్, మహేష్, రాజు, రమేష్, సీఈఓ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.