Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తూరు
మండలంలోని మల్లాపూర్ తండాలో ఎఫ్టీఎల్లో నిర్మించిన రోడ్డును తొలగించాలని కోరుతూ శనివారం తాండ వాసులు తహశీల్దార్ రాములుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మల్లాపూర్ రెవెన్యూ పరిధిలోని 360 సర్వే నెంబర్లో ఉన్న చెరువులో కొందరు ఎఫ్టీఎల్ పరిధిలో రోడ్డు నిర్మాణం చేపట్టారని ఇరిగేషన్ అధికారులచే సర్వే నిర్వహించి ఎఫ్టీఎల్ హద్దులను గుర్తించి చెరువులను కాపాడాలనివారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్ నాయక్, టీఆర్ఎస్ మాజీ ఎస్టీసెల్ మండలాధ్యక్షులు నేనావత్ గోపాల్‌నాయక్, కిషన్, కే చందర్, శీను, లోబియా, రాములు, ఏంచందర్ తదితరులు ఉన్నారు.