Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహేశ్వరం
నేడు జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లేమూరు డాక్టర్ రాజ్‌కుమార్ అన్నారు. శనివారం తుక్కుగూడ మున్సిపాలిటీలో నిర్వహించే పల్స్ పోలియోను విజయవంతం చేయాలని ఆశావర్కర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అప్పుడే పుట్టిన పిల్లదల మొలుకుని 5 ఏండ్ల పిల్లల వరకు పల్స్ పోలియో చుక్కలను వేయించా లన్నారు. లేమూరు పీహెచ్నీ పరిధిలో మొత్తం 4875 మంది చిన్న పిల్లలు ఉన్నారన్నారు. మొత్తం 22 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.