Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నిఖిల
నవతెలంగాణ- వికారాబాద్ కలెక్టరేట్
శనివారం ఎన్టీటీ డాటా ఐటీ సంస్థతో కలిసి నిర్మన్ ఆర్గనైజేషన్ అనే ఎన్జీవో స్వచ్ఛంద సంస్థ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరి టీబీ, చెస్ట్ ఆస్పత్రికి రూ.20 లక్షల 70 వేలుతో 10 ఐసీయూ బెడ్స్ డొనేట్ చేశామని వీటితో పాటు ఈగో (ఈ గవర్నమెంట్) పౌండేషన్, కరుణ ట్రస్ట్‌లు భాగస్వాములుగా ఉన్నాయి. ఇట్టి ఐసీయూ సెంటర్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ..కరోనా కష్టకా లంలో పేద ప్రజలకు ఐసీయూ బెడ్స్ ద్వారా సహాయం అందించి వారి ప్రాణాలు కాపాడే ఇంత మంచి నిర్ణయం తీసుకున్నా ఎన్టీటీ డాటా, నిర్మన్ ఆర్గనైజేషన్ ఇతర భాగస్వామ్య సంస్థలకు జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు అన్నారు. ప్రయివేట్ ఆస్పత్రులకు దీటుగా ఐసీయూ సెంటర్‌ను ఏర్పాటు చేయడం పట్ల సంస్థల యజమానులను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఇంత గొప్ప అవకాశాన్ని జిల్లా ప్రజలు, ఆస్పత్రి సిబ్బంది వినియో గించు కోవాలని అన్నా రు. ఈ సందర్భంగా ఎన్టీటీ డాటా ప్రాజెక్ట్ ప్రోగ్రాం మేనేజ్మెంట్ స్ట్రాటజిక్ అడ్వైజర్ ప్రసాద్ తిప్పరాజు మాట్లాడుతూ నిర్మన్ ఆర్గనై జేషన్ స్వచ్ఛం ద సంస్థతో కలిసి పని చేయ డం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం నిర్మన్ సీిఓఓ ఉమా కేసాని మాట్లాడుతూ కోవిడ్ సమయంలో హైదరాబాద్‌లో ఐసీయూ బెడ్స్ దొరకక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి వారిని చూశాక తమ సంస్థ నుంచి కొంతైనా సహాయం చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. హైదరాబాద్ వరకు రాకుండానే మెరుగైన చికిత్స అందుతుంది అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని అందుకు సహకరించిన ఎన్టీటీ డాటా ఇతర సంస్థలకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. తమ సంయుక్త సంస్థ నుంచి రాష్ట్రంలో 54, దేశంలో 117 ఆస్పత్రులకు ఐసీయూ బెడ్స్ ను డొనేట్ చేయడం గర్వంగా ఉంది అన్నారు. ఫ్రంట్ వారియర్స్ అయినా డాక్టర్లకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. కార్యక్రమంలో జిల్లా డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం, టీబీ ఆస్పత్రి సూపర్డెంట్ సుధాకర్ షిండే, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.