Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన
- సీపీఐ(ఎం) నాయకులు శ్రీనివాస్
నవతెలంగాణ-తాండూరు
మండల పరిధిలోని కోనూరు గ్రామంలో దౌర్జన్యంగా అక్రమంగా నిర్మాణాలు కొనసాగిస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం దారుణ మని సీపీఐ(ఎం) నాయకులు శ్రీనివాస్ అన్నారు. అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం పట్టణ కేంద్రంలో ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో డివిజన్ ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ.. మండలం గోనూరు గ్రామం లో గ్రామపంచాయతీ చట్టాలను ఉల్లంఘిస్తూ గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా అక్రమంగా దౌర్జన్యంగా చాకలి వెంకటయ్య స్థలంలో ఇంటి నిర్మాణం చేస్తున్న హౌంగార్డు శ్రీనివాస్‌పై చట్టపరమైన చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ సెక్రెటరీ మండల ఎంపీఓ ఫిర్యాదు చేశామని, కొత్త పంచాయతీ రాజ్‌చట్టం ప్రకారం అక్రమ కట్టడాలను వెంటనే కూల్చి వేయాలని అన్నారు. తాండూర్ డివిజన్ డీఎల్పీఓడీపీవో కలెక్టర్ స్పందించి నియోజకవర్గంలో గోనూర్, గొట్టుగా కాలన్లో జరుగుతున్న గ్రామ కంఠం భూమీలో గ్రామ పంచాయతీల పర్మిషన్ లేకుండా ఇంటి నిర్మాణాలు చేస్తు న్న వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికా రులు చర్యలు తీసుకోకపోతే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున డీపీిఓ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు మహేష్, మల్లేష్, సతీష్, బాధితులు చాకలి వెంకటయ్య, కటికే జగదీశ్, తదితరులు పాల్గొన్నారు.