Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ''మీతో నేను'' అల్లాపూర్ పర్యటనలో
ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
నవతెలంగాణ- వికారాబాద్ రూరల్
నియోజకవర్గంలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కరం దిశగా ముందుకు సాగుతు న్నామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శనివారం ఉదయం ఎమ్మెల్యే ఆనంద్ 'మీతో నేను' కార్యక్రమంలో భాగంగా ధారూర్ మండల పరిధిలోని అల్లాపూర్ గ్రామంలో పర్యటిం చారు. గ్రామ సర్పంచ్ విజయమ్మ వార్డు సభ్యులు నాయకులతో కలిసి గ్రామంలోని గ్రామ సమస్యలపై ఆరా తీశారు. ప్రధాన సమస్యలైన పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి ప్రధాన అంశాలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా ఏర్పాటైన కాలనీలో ప్రతీ ఇంటికి విద్యుత్, మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఇవ్వాలని, ప్రజలు చెర్రలు తీయ కుండా చూడాలని, ట్యాప్లు ఏర్పాటు చేయాలని, మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. పంటపొలాల్లో వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని, ఇండ్లకు దగ్గరగా ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తొలగించా లన్నారు. నూతన స్థంభాలను ఏర్పాటు చేసి పాత స్థంబాలను తొలగించాలని, థర్డ్ వైర్ ఏర్పాటు చేయాలని, విద్యుత్ అధికారులు ప్రజలకు అందు బాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ సీ చైర్మెన్ సంతోష్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు విజరు, మండల టీఆర్ఎస్ నాయకుడు రాజునాయక్తో పాటు జాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.