Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తూరు
లారీ డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో యువకుడు మృతి చెంది న ఘటన మున్సి పాలిటీ పరిధి లోని జాతీయ రహదారి నాట్కో చౌరస్తాలో శనివారం చోటుచేసుకుంది. ఏఎసై విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. ఫరూక్‌నగర్‌కు చెందిన ఆసిఫ్(24) ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో హైదరా బాద్ వైపు నుంచి వస్తున్న లారీ డ్రైవర్ ఎదురుగా బైక్‌పై వస్తున్న యువకుడిని గమనించకుండా ఢకొీట్టాడు. వెనుక వైపు చక్రాలు యువకునిపై నుంచి వెళ్లడం తో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి షబ్బీర్ అలీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.