Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుల్కచర్ల
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం కుల్కచర్ల, చౌడాపూర్ మండలాల్లో 50 మంది నిరుపేద విద్యార్థులకు పీఎన్డీబ్యూ మండల ఇన్చార్జి రామచంద్రయ్య ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి రూ.1500 చొప్పున చెక్కలు పంపిణీ చేశారు. పలువురు విద్యార్థులకు స్పోర్ట్స్ బ్యాగులను అందజేశారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సేవలు వెలకట్టలేనివన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు భీంరెడ్డి, సర్పంచ్ సౌమ్య వెంకట్రామిరెడ్డి, ఎంపీటీసీ ఆనందం ముదిరాజ్, ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య, శ్రీనివాస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.