Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయడాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియా పూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డతండాలో బీజేపీ సీని యర్ నాయకులు మొవ్వా సత్యనారాయణ, రవి కుమార్ యాదవ్, కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ముందుగా సేవాలాల్ మహారాజ్ గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు భూ కబ్జాలకు పాల్పడుతూ ,ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డీఎస్ఆర్ ప్రసాద్,రాఘవేంద్రరావు, రాధా కృష్ణయాదవ్, ఎల్లేష్, వినరు, త్రినాథ్, మదనాచారి, జంగయ్య యాదవ్, హరికృష్ణ, లక్ష్మణ్ ముదిరాజ్, శ్రీశైలం కురుమ, గణేష్ ముదిరాజ్, హరిప్రియ, స్వప్నరెడ్డి, వినోద్ యాదవ్, ఆంజనేయులు, చందు, మధుయాదవ్, శివరాజ్, శ్రీనుజే, రాము, రాజ్, జైశ్వాల్ తదితరులు పాల్గొన్నారు.