Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి సైన్స్ పేయిర్లు ఎంతగానో ఉపయోగపడతాయని సీఎంఆర్ కాలేజ్ అసిస్టేంట్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం మదీనగూడలోని త్రివేణి పాఠశాల క్యాంపస్లో సైన్స్ ఎక్స్పో సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం త్రివేణి పాఠశాల డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్రచౌదరి, సీఏసీ నటరాజ్, సీఆర్వో సాయి నరసింహారావు,వైస్ ప్రిన్సిపాల్ హిమ బింధుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు ప్రతి ఒక్కరిని ఎంత గానో ఆకట్టుకున్నాయి. పిల్లలు తయారు చేసిన నమూనాల గురించి చక్కగా వివరించారు. వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల్లో సృజ నాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మేనేజ్మెంట్ను అభినందించారు.