Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరుకానున్న మంత్రులు,ఎమ్మెల్యేలు
- జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
28న ఉదయం 11 గంటలకు వికారాబాద్ జిల్లా కేంద్రంలో రూ.5.15 కోట్ల నిధులతో నూతన జిల్లా పరిషత్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్టు జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు గౌరవ ఎర్రబెల్లి దయాకరరావు, జిల్లా గౌరవ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డిలతో శంకుస్థాపన చేయనునట్టు తెలిపారు. ఈ భవనం మంజూరులో ప్రధాన పాత్ర పోషించిన గౌరవ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి వర్యులు పట్నం మహేందర్ రెడ్డి, మరో గౌరవ ఎమ్మెల్సీ శాంబిపూర్ రాజు, చేవెళ్ల ఎంపీ గౌరవ రంజీత్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆనంద్, మహేష్ రెడ్డి, యాదయ్య, పట్నం నరేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారి తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు,ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు హాజరుకావాలని ఆమె కోరారు.