Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ గోవింద్, ఉప సర్పంచ్ సత్తి
నవతెలంగాణ-కొడంగల్
సర్కారు బడులు బలోపేతం చేసేం దుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని సర్పంచ్ గోవింద్, ఉప సర్పంచ్ సత్తి అన్నారు, మన ఊరు మన బడి కార్య క్రమంలో భాగంగా శనివారం కొడంగల్ మండలం అంగడి రైచూరు గ్రామంలోని పాఠ శాలను ఎస్ఎంసీ చైర్మెన్ పెంటప్పతో కలిసి పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎస్ఎంసీ కమిటీ, గ్రామ పంచాయతీ తీర్మానం చేసి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపమన్నారు. పాఠశాలలో ముఖ్యంగా అదనపు తరగతి గదులు, ప్రహరి, కిచెన్ షెడ్, మూత్రశాలలు, విద్యుత్, త్రాగు నీటి సదుపాయాలు కల్పించాలని ప్రతిపాదిం చినట్టు తెలిపారు, పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం చాలా బాగుందని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటప్ప, ఉపాధ్యా యులు బ్రహ్మచారి, పూర్వ విద్యార్థి అశోక్ తదితరులు పాల్గొన్నారు.