Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాండూరు మైనార్టీ నాయకులు
- ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి,
ఎంపీ రంజిత్ రెడ్డిలకు వినతి
నవతెలంగాణ-తాండూరు
తాండూరు పట్టణంలో ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం మైనారిటీ వెల్ఫేర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ శనివారం మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ డా.గడ్డం రంజిత్ రెడ్డిలను తాండూర్ మైనార్టీ నాయకులు కోరారు. హైదరాబాద్ బంజారాహిల్స్ మహేందర్రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి తాండూర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాలతో స్థానిక ఎంఐఎం నేతలు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తాండూరు పట్టణ కేంద్రంలో ఎంపీ కోటా కింద రూ. 25 లక్షలు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కోటా కింద మరో రూ.25 లక్షల నిధులను మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా ప్రార్థనల సమయంలో నీటి సమస్య ఏర్పడిన నేపథ్యంలో తాండూర్లోని వివిధ ప్రాంతాల్లో 13 బోరు బావులను వేయించాలని పేర్కొన్నారు.ఈ సంద ర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తాను మంత్రిగా ఉన్న సమయంలో తాండూరులో మైనారి టీల సంక్షేమం కోసం కోట్ల నిధులను సేకరించినట్టు వివరించారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో రూ. 36 కోట్లతో రెండు మైనారిటీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే ఈద్గా మైదానంలో అభి వృద్ధి కోసం నిధులు కేటాయించామని చెప్పారు. అదే విధంగా జిల్లాలో ఎక్కడలేని విధంగా తాండూరులో మహిళల కోసం ప్రత్యేక ప్రార్థన ఈద్ గా మైదానాన్ని నాలుగు కోట్ల నిధులతో నిర్వహించేందుకు కృషి చేశామన్నారు. చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కెేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేని విధంగా సాగుతున్నాయన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం తాము ఎల్లవేళలా ముందుంటామని రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డిలు స్పష్టం చేశారు. ఎంఐఎం తాండూర్ ఇన్చార్జి అబ్దుల్ హాది, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తమకు తాండూరులో ఎల్లవేళలా అండగా నిలుస్తున్న ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి సేవలు ఎప్పుడూ మర్చిపోలేమని మైనార్టీ నేతలు అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డిలను వారు సన్మానించారు. ఈ సమావేశంలో మైనారిటీ పెద్దలు కుర్షీద్ హుస్సేన్,అబ్దుల్ అహాద్ మహమ్మద్ బాబర్,ఫారుక్ సోయిల్,జహిరుద్దీన్, షౌకత్ పటేల్,అబ్దుల్ సత్తార్ గోల్కొండ, ఆర్టీఏ డైరెక్టర్ జావీద్, అబ్దుల్ సత్తార్, జుబేర్ లాలా, తదితరులు పాల్గొన్నారు.