Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులతో ఆస్పత్రి సిబ్బంది అవగాహన ర్యాలీ
నవతెలంగాణ- పెద్దేముల్
ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి వేయించాలని పెద్దేముల్ ఆస్పత్రి పీిహెచ్ఎన్ అరుణ కుమారి తెలిపారు. శనివారం మండల కేంద్రంలో ఆస్పత్రి సిబ్బంది విద్యార్థుల చేత పల్స్ పోలియో చుక్కల పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ కుమారి మాట్లాడుతూ...5 ఏండ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. నేడు మండ లంలో ఉదయం 9 గంటల నుంచి పల్స్ పోలియో చుక్కల శిబిరాలు నిర్వహి స్తున్నట్ల్టు తెలిపారు. పల్స్ పోలియో శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎఏన్ఎంలు సుజాత, వెంకటమ్మ, హరీష్ శంకర్, ఆశా వర్కర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు