Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్
నవతెలంగాణ-తాండూరు
విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ అన్నారు. శనివారం పట్టణంలోని ఐడియల్ స్కూల్లో సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ పాల్గొన్నారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ సైన్స్ పరికరా లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.. విద్యార్థులు చదువుతో పాటు విజ్ఞానంలో నూ ముందుండి తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యా యులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని పేర్కొ న్నారు. పాఠశాల యాజమా న్యాలు ఇలాంటి కార్యక్ర మాలు నిర్వహించడం ద్వారా చదువుతో పాటు సాంస్కృతిక విషయాలు విద్యార్థులు నేర్చుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బోయ రవిరాజు, వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు రొంపల్లి సంతోష్, తాండూరు పట్టణ అరవింద్ ,పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.