Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూర్
నాగర్కర్నూల్లో రెండు రోజుల పాటు జరిగే తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశానికి హైదరాబాద్ జిల్లా నుంచి టీఎస్ యూటీఎఫ్ నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్బంగా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ మాట్లాడు తూ ఈ సమావేశాల్లో విద్యారంగంలోని పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేస్తామనీ, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తూనే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. 317 జీవో లోని లోపాలను సవరించాలనీ, పదోన్నతులు, బదిలీల ప్రక్రియను వెంటనే చేపట్టాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సింహాచలం మాట్లాడు తూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపె ట్టడాన్ని స్వాగతిస్తున్నామనీ, దానికి అనుగుణంగా అవసర మైన మౌళిక సదుపాయాలు వెంటనే కల్పించాలని కోరారు. సమావేశానికి వెళ్లిన వారిలో రాష్ట్ర కార్యదర్శి శారద, జిల్లా ఉపాధ్యక్షుడు నరసింహా రెడ్డి, కోశాధికారి రాజారావు, జిల్లా కార్యదర్శులు మధు సూధన్ రావు, వినరు కుమార్ ఉన్నారు.