Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఏవి సుధాకర్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
వేతన స్థిరీకరణ 2020లో భాగంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన రెండు నెలల బకాయిలను ఏకకాలంలో చెల్లించాలని పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్అధ్యక్షులు ఏవి సుధాకర్ డిమాండ్ చేశారు. అందుకోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో 107ను సవరించాలని కోరారు. గతంలో రెండు నెలల బకాయిలు ఇదే ఆర్ధిక సంవత్సరంలో చెల్లిస్తామని ప్రభుత్వం, నేడు 18 వాయిదాలలో చెల్లిస్తామనడం ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసంచేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలను ఏక మొత్తంలో విడుదల చేస్తూ వెంటనే సవరణ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.